హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తేతెలంగాణ): గ్రీన్ హైడ్రోజన్ కేంద్రంగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. విదేశీ పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన టోక్యోలోని యమానాషి హైడ్రోజన్ కంపెనీ ప్లాంట్ను సందర్శించారు.
శాస్త్రవేత్తలు, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ గురించి తెలుసుకున్నారు.