Demat Account | డీమ్యాట్‌కు భలే డిమాండ్.. 12.7 కోట్లకు చేరిన ఖాతాల సంఖ్య
డీమ్యాట్ ఖాతాలకు భలే డిమాండ్ కనిపిస్తున్నది. గత నెల ఆగస్టు ఆఖరుకల్లా ఖాతాల సంఖ్య 12.7 కోట్లకు చేరింది. నిరుడుతో పోల్చితే ఏకంగా 26 శాతం వృద్ధి నమోదవడం గమనార్హం.
Demat Account | ముంబై, సెప్టెంబర్ 25: డీమ్యాట్ ఖాతాలకు భలే డిమాండ్ కనిపిస్తున్నది. గత నెల ఆగస్టు ఆఖరుకల్లా ఖాతాల సంఖ్య 12.7 కోట్లకు చేరింది. నిరుడుతో పోల్చితే ఏకంగా 26 శాతం వృద్ధి నమోదవడం గమనార్హం. గత ఏడాది ఆగస్టు చివరి నాటికి ఉన్న డీమ్యాట్ ఖాతాలు 10.1 కోట్లే. కాగా, గరిష్ఠంగా సీడీఎస్‌ఎల్‌లో 9.35 కోట్లు, ఎన్‌ఎస్‌డీఎల్‌లో 3.3 కోట్ల డీమ్యాట్ ఖాతాలున్నాయని సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తాజా గణాంకాలు చెప్తున్నాయి. ఈక్విటీ మార్కెట్ల నుంచి వస్తున్న ఆకర్షణీయ రాబడులతోపాటు డీమ్యాట్ ఖాతాలను తెరిచే ప్రక్రియ మునుపటి కంటే సులభతరం కావడం కూడా పెరుగుదలకు కారణమేనని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై పెరుగుతున్న ఆసక్తి, అవగాహనలతోపాటు ముఖ్యంగా ట్రేడింగ్‌పై యువ మదుపరుల్లో స్పష్టత సైతం డీమ్యాట్ ఖాతాల సంఖ్యను పెంచుతూపోతున్నట్టు చెప్తున్నారు. ఇదిలావుంటే ఈ ఆగస్టులో 31 లక్షల డీమ్యాట్ ఖాతాలు కొత్తగా తెరుచుకున్నాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది.
అంతకుముందు నెల జూలైలో 30 లక్షల ఖాతాలు తెరిచారని పేర్కొన్నది. దీంతో 4.1 శాతం వృద్ధి కనిపించినట్టు వివరించింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) ఏప్రిల్-ఆగస్టు మధ్య నెలవారీ కొత్త డీమ్యాట్ ఖాతాలు సగటున 21 లక్షలు తెరుచుకున్నట్టు మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించింది. మరోవైపు ఎన్ఎస్ఈ క్రియాశీల క్లయింట్ల సంఖ్య వరుసగా గత రెండు నెలలుగా పెరుగుతున్నది. ఆగస్టులో 3.27 కోట్లకు చేరుకున్నాయి. ఇక జెరోధా, ఏంజెల్ వన్, గ్రో, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ టాప్-5 డిస్కౌంట్ బ్రోకర్లుగా ఉన్నా యి. కాగా, సెబీ సూచనల ప్రకారం వ్యక్తిగత డీమ్యాట్ ఖాతాదారులంతా ఈ నెలాఖరుకల్లా వారి నామినీ వివరాలను జత చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఖాతా స్తంభించబడుతుందని, పెట్టుబడుల రిడీమ్కూ వీల్లేకుండా పోతుందని సెబీ హెచ్చరిస్తున్నది. ఇప్పటికే ఉన్న ఖాతాదారులు, కొత్తవారికీ ఇది వర్తిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

