Vehicles sales : జూలై నెలలో పెరిగిన వాహనాల డిమాండ్
Vehicles sales : గత నెలలో వాహానాల అమ్మకాలు (Vehicles sales) అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా కమర్షియల్ వాహనాలు ఎక్కువగా అమ్ముడుపోయాయి. జూలై నెలలో ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలతోపాటు అన్ని విభాగాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది.

న్యూఢిల్లీ : సొంత కారు, బైకును కొనుక్కోవాలని సాధారణంగా ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటారు. ఈ కోరికలే కార్ల విక్రయాలు పెరిగేందుకు దోహదపడుతున్నాయి. గత నెలలో వాహానాల అమ్మకాలు (Vehicles sales) అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా కమర్షియల్ వాహనాలు ఎక్కువగా అమ్ముడుపోయాయి. జూలై నెలలో ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలతోపాటు అన్ని విభాగాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. అలాగే, వాహనాల రిజిస్ట్రేషన్లలో వార్షిక ప్రాతిపదికన 34.12 శాతం పెరుగుదల ఉన్నది. గత నెలలో దేశవ్యాప్తంగా మొత్తం 15,56,777 వాహనాలు అమ్ముడవగా.. గత ఏడాది ఇదే నెలలో 11,60,721 యూనిట్లుగా ఉన్నది.
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్ఏడీఏ) తెలిపిన వివరాల ప్రకారం, గత నెలల కమర్షియల్ వాహనాలు 52,130 అమ్ముడుపోయాయి. ఇది వార్షిక ప్రాతిపదికన 165.94 శాతం పెరుగుదలగా ఉన్నది. గత ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 19,602 గా ఉన్నది. అయితే, 2019 జూలై నెల అమ్మకాలతో పోలిస్తే ఇది 24.84 శాతం తక్కువ. రెండేండ్ల క్రితం ఈ క్యాటగిరిలో 69,361 వాహనాల అమ్మకాలు జరిగాయి. మూడు చక్రాల వాహనాల అమ్మకాల్లో కూడా వృద్ధి నమోదైంది. జూలై నెలలో 83 శాతం కంటే ఎక్కువ వృద్ధి కనిపించింది. గత నెలలో మొత్తం 27,904 వాహనాలతో 83.05 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. 2020 జూలైలో ఈ సంఖ్య 15,244. రెండేండ్ల క్రితంతో పోలిస్తే ఆటోల అమ్మకాలు సగానికి తక్కువగా ఉన్నాయి. జూలై 2019 లో 58,943 యూనిట్ల ఆటోలు నమోదయ్యాయి.
టూ వీలర్స్ ఎక్కువగా.. ట్రాక్టర్లు తక్కువగా..
జూలై నెలలో టూ వీలర్స్ కొనుగోలులో కూడా విపరీతమైన పెరుగుదల ఉన్నది. 2021 జూలైలో 11,32,611 బైకులు నమోదవగా.. గత సంవత్సరం ఇదే నెలలో 8,87,937 యూనిట్లుగా ఉన్నది. అంటే, బైకుల అమ్మకాల్లో 27.56 శాతం పెరుగుదల కనిపించింది. అయితే, ట్రాక్టర్ల కొనుగోళ్లు మందకోడిగా సాగుతున్నాయి. గత నెలలో 82,388 యూనిట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే నెలలో 77,257. జూన్ నెలలో 14 శాతం వార్షిక వృద్ధి ఉండగా, జూలైలో అది 6.64 శాతానికి పరిమితమైంది.
ఇవి కూడా చదవండి..
ఆఫ్ఘాన్ నుంచి మన వాళ్లను రప్పించండి : కాంగ్రెస్
12 రెట్లు పెరిగిన ఎంఆర్ఎఫ్ లాభం
మార్కెట్లోకి హోండా ఇ-స్కూటర్ యు-గో
కాకోరి రైలు దోపిడీకి 96 ఏండ్లు
రెండో సెషన్ ఐపీఎల్ కోసం కొత్త నిబంధన.. అదేంటంటే..?
తడిసి మోపెడవుతున్న డిజిటల్ ఖర్చు..
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

