న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 : మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ఈవీలకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. సంస్థకు చెందిన ఎక్స్ఈవీ 9ఈ, బీఈ 6 మాడళ్లకు తొలిరోజే 30,170 బుకింగ్‌లు వచ్చాయని తెలిపింది. వీటి మొత్తం నికర విలువ రూ.8,472 కోట్లు(షోరూం ధర ప్రాతిపదికన). ఈ విషయాన్ని మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ఎక్స్‌లో వెల్లడించారు. గత నెలలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ రెండు మాడళ్లపై ఈ శుక్రవారం నుంచి కమర్షియల్ బుకింగ్‌ను ఆరంభిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కారు రూ.18.9 లక్షల నుంచి రూ.30.5 లక్షల లోపు లభించనున్నది.