న్యూఢిల్లీ : టెక్ దిగ్గజాలు మాస్ లేఆఫ్స్‌కు తెగబడుతూ పెద్దసంఖ్యలో ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నాయి. తాజాగా మెటా లేఆఫ్స్‌తో కొలువులు కోల్పోయిన వేలాది ఉద్యోగులు తమకు తగిన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్ధితి.
జాబ్ మార్కెట్ సంక్లిష్టంగా మారిన క్రమంలో డెల్ టెక్నాలజీస్ (Dell) ఇండియా కన్జూమర్,
స్మాల్ బిజినెస్ వీపీ, ఎండీ రాజ్ కుమార్ రిషీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే ప్రొఫెషనల్స్‌గా మనం టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని అన్నారు. లేటెస్ట్గా ముందుకొస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని ఆ నైపుణ్యాలను ఒడిసిపట్టుకోవడం కీలకమని స్పష్టం చేశారు.
నిరంతరం మారుతున్న జాబ్ మార్కెట్లో నిలబడాలంటే నూతన టెక్నాలజీలని అందిపుచ్చుకుని కెరీర్లో ముందుకు సాగాల్సిందేనని అన్నారు. ఏఐ అయినా మరో టెక్నాలజీ అయినా మన నైపుణ్యాలు మెరుగుపడేలా వాటిని అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. ఈరోజు గేమింగ్, వీడియో ఎడిటింగ్, మ్యూజిక్ సహా పలు కెరీర్ అవకాశాలు ముందుకొచ్చాయని వాటిపై కూడా దృష్టి సారించాలని చెప్పారు.
Read More