
హైదరాబాద్, జనవరి 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.4.62 కోట్ల నికర లాభాన్ని గడించింది సాగర్ సిమెంట్. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.49.59 కోట్లతో పోలిస్తే 91 శాతం తగ్గినట్లు పేర్కొంది. ఆదాయంలోనూ 8 శాతం తగ్గి రూ.333.65 కోట్లకు పరిమితమైనట్లు వెల్లడించింది. ముడి సరుకులు, సరుకు రవాణా, ఇతర ఖర్చులు అధికమవడం వల్లనే లాభాల్లో భారీ గండి పడిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.