హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని నియోపోలీస్ గ్రివా బిజినెస్ పార్క్‌లో డీఈ షా తన కొత్త కార్యాలయాన్ని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జూబ్లీహిల్స్‌లోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన 30 ఏండ్ల వేడుకలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఈ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డీఈ షా కొత్త కార్యాలయం హైదరాబాద్‌పై సంస్థకున్న నమ్మకానికి నిదర్శనంలా నిలుస్తుందన్నారు. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ అత్యాధునిక కార్యాలయం 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనున్నట్టు ఆయన వివరించారు.
ఈ కొత్త కార్యాలయంలో సంస్థ డైనమిక్ వర్క్ కల్చర్ బలోపేతం కావడంతో పాటు ఆలోచనలు పంచుకోవడానికి, సమస్యల సమిష్టి పరిష్కారాలకు వేదిక కానున్నట్టు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చైతన్న గొర్రెపాటి, ఆపరేటింగ్ కమిటీ మెంబర్ లక్ష్మీ ప్రసాద్, ఎండీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు ఏడీ ఫిష్మెన్ తదితరులు పాల్గొన్నారు.