హైదరాబాద్, ఏప్రిల్ 30: సిగ్నీస్ ఎనర్జీ..హైదరాబాద్లో 4.8 గిగావాట్ల బెస్ గిగాఫ్యాక్టరీని ప్రారంభించింది. రూ.100 కోట్ల పెట్టుబడితో ఐదు ఎకరాల క్యాంపస్లో 1.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పింది.
కంపెనీ సీఈవో వెంకట్ రాజారామన్ మాట్లాడుతూ..ఈ గిగాఫ్యాక్టరీ కోసం తొలి విడుత రూ.100 కోట్లు, రెండో విడుత మరో రూ.250 కోట్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటునట్టు చెప్పారు.