Bit Coin | బిట్‌కాయిన్‌తోపాటు ప్రధాన క్రిప్టో కరెన్సీలన్నీ ట్రేడింగ్‌లో నష్టాలనే చవి చూశాయి. శనివారంతో ముగిసిన ట్రేడింగ్‌లో నేల చూపులే చూశాయి. లండన్‌లో శనివారం మధ్యాహ్నం బిట్ కాయిన్ 2.5 శాతం నష్టపోయి 29 వేల డాలర్ల దిగువన ట్రేడయింది. గత రెండేండ్లలో ఒక వారం రోజుల్లో బిట్ కాయిన్ ట్రేడింగ్ అత్యంత అస్థిరత మధ్య సాగడం ఇదే తొలిసారి. రెండో స్థానంలో ఉన్న ఏథెర్ సైతం 2000 డాలర్ల దిగువకు పడిపోయి.. మధ్యాహ్నం తర్వాత కాస్త పుంజుకున్నది. ఇక ఆల్గోరిథమిక్ స్టేబుల్ కాయిన్ టెర్రా యూఎస్డీ అనుబంధ క్రిప్టో లూనా పూర్తి మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది.
గత నెల ఐదో తేదీన లూనా విలువ 116 డాలర్లు పలికింది. ఇది ఆల్‌టైం రికార్డు. కానీ గత వారం రోజుల్లో లూనా విలువ 40 డాలర్ల నుంచి ఆరు డాలర్లకు పడిపోయింది. టెర్రా యూఎస్డీ, లూనా టోకెన్లను డిలిస్ట్ చేస్తున్నట్లు అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ బినాన్స్ శుక్రవారం ప్రకటించింది. భారత్‌లోని కాయిన్ స్విచ్ కుబేర్, వజీర్ ఎక్స్, కాయిన్ డీసీఎక్స్ కూడా అదే పని చేయడంతో లూనా విలువ పూర్తిగా నష్టపోయింది.
ఇంకా ఆల్ట్‌కాయిన్స్ కూడా నష్టపోగా, సొలానా 4.8శాతం, అవలాంచే 6.4, పొల్కాడాట్ 4.5 శాతం నష్టంతో ముగిసింది. తిరిగి బిట్ కాయిన్ 30 వేల డాలర్లకు పుంజుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
సోమవారం ట్రేడింగ్‌లో 33,400 డాలర్లకు పడిపోయిన బిట్‌కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సగానికి పైగా నష్టపోయింది. గతేడాది ఆల్‌టైం రికార్డు పలికిన బిట్ కాయిన్ ధర 67,566 డాలర్లు. ధరల పెరుగుదలతోపాటు వడ్డీరేట్ల పెంపు వంటి అంశాలు ఇన్వెస్టర్లపై నెగెటివ్ ప్రభావం చూపుతుందని గైట్టస్ క్రిప్టో ఎక్స్చేంజ్ ప్రతినిధి విక్రమ్ సుబ్బురాజ్ చెప్పారు.