కార్డులకూ బీమా
క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, పాన్ కార్డులతోపాటు లాయల్టీ, ఇతర మెంబర్షిప్ కార్డులన్నీ కూడా వ్యక్తిగత ఫైనాన్స్‌లో ఎంతో కీలకం. ఈ క్రమంలోనే కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ (సీపీపీ)కు ప్రాధాన్యం పెరుగుతున్నదిప్పుడు. కార్డులు ఎక్కడైనా పోయినా, దొంగిలించబడినా, మోసానికి గురైనా సీపీపీలో భాగంగా బీమాను పొందవచ్చు.
క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, పాన్ కార్డులతోపాటు లాయల్టీ, ఇతర మెంబర్షిప్ కార్డులన్నీ కూడా వ్యక్తిగత ఫైనాన్స్‌లో ఎంతో కీలకం. ఈ క్రమంలోనే కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ (సీపీపీ)కు ప్రాధాన్యం పెరుగుతున్నదిప్పుడు. కార్డులు ఎక్కడైనా పోయినా, దొంగిలించబడినా, మోసానికి గురైనా సీపీపీలో భాగంగా బీమాను పొందవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే మీ కార్డులకు బీమా పాలసీ లభిస్తుందన్నమాట. ఈ పాలసీతో మీకు కార్డులిచ్చిన సంస్థను లేదా బ్యాంకును నేరుగా సందర్శించి మీరు చేజార్చుకున్న కార్డులను సులభంగా బ్లాక్ చేయవచ్చు. కొత్త కార్డులకు మళ్లీ దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.
పాలసీ ఎవరిస్తారు?
కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ కంపెనీలతోపాటు బ్యాంకులు, క్రెడిట్ కార్డు కంపెనీలు, ఫైనాన్స్ సంస్థలు ఈ రకమైన పాలసీలను అందిస్తున్నాయి. దాదాపు అన్ని ప్రముఖ క్రెడిట్ కార్డుజారీదారులు తమ కస్టమర్లకు ఈ పాలసీలను అందిస్తున్నాయి. పాలసీ వ్యయం, ప్రయోజనాలనుబట్టి ఎంచుకోవచ్చు.
ఎలా పొందవచ్చు?
కనీస వ్యక్తిగత వివరాలతో, మీ కార్డులకు సంబంధించిన సమాచారంతో ఓ ఫారంను నింపి ఈ పాలసీని పొందవచ్చు. ఇందుకు సూచించిన వార్షిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంలో కార్డులను కోల్పోతే అత్యవసర సాయం పాలసీతో అందుకోవచ్చు. హోటల్, ట్రావెల్ బిల్లుల వంటివి చెల్లించుకోవచ్చు. ఏ కష్టం లేకుండా తిరిగి ఇంటికీ చేరుకోవచ్చు. ఏటేటా కవరేజీని తీసుకోవాల్సి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

