హైదరాబాద్, అక్టోబర్ 24: కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నతి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాకినాడ ఎరువుల ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, గుజరాత్లో మల్టీ-ప్రొడక్ట్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీంతో కాకినాడ ప్లాంట్లో కాంప్లెక్స్, యూనిక్యూ ఎరువుల కెపాసిటీ 7.5 లక్షల టన్నులకు చేరుకోనున్నది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.7,509 కోట్ల ఆదాయంపై రూ.696 కోట్ల నికర లాభాన్ని గడించింది.