హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ఫార్మా, న్యూట్రాసూటికల్ ఎక్సిపియెంట్ సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న డీఎఫ్ఈ ఫార్మా హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో కొత్తగా అత్యాధునిక క్లోజర్ టు ది ఫార్ములేటర్ (సీ2ఎఫ్) కేంద్రాన్ని ప్రారంభించినట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కాన్సెప్ట్ నుంచి వాణిజ్య ఉత్పత్తి వరకు అన్ని దశల్లో సమయాన్ని తగ్గించేందుకు ఈ సీ2ఎఫ్ ఔషధ కంపెనీలకు సహాయ పడుతుందని, ఈ కేంద్రం ఏర్పాటుకు భారీ పెట్టుబడి పెట్టినట్టు సీఈవో మార్టి హెడ్మాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫార్మా కంపెనీల వ్యాల్యూ చైన్‌ను పెంచడంలో సహాయపడే ప్రధాన లక్ష్యంతో సీ2ఎఫ్ స్థాపించడం సంతోషంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి కే తారకరామారావు ఒక అభినందన సందేశంలో తెలిపారు. తెలంగాణలోని జీవశాస్ర్తాల సంస్థలు ఈ కేంద్రం సేవలను వినియోగించుకొనేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు.