Cognizant | యూఎస్ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ (Cognizant) తన చెన్నైలోని ప్రధాన కార్యాలయాన్ని విక్రయిస్తోంది. రెండు దశాబ్దాలుగా ఈ కార్యాలయాన్ని భారత్ హెడ్ క్వార్టర్స్‌గా నిర్వహిస్తున్న కాగ్నిజెంట్.. ఈ స్థలం విక్రయం ద్వారా రూ.750-800 కోట్ల నిధులు పొందనున్నదని తెలుస్తోంది. చెన్నైలోని ఐటీ కారిడార్ వద్ద ఉన్న కాగ్నిజెంట్ ఇండియా ప్రధాన కార్యాలయం.. 15 ఎకరాలలో నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఆఫీస్ స్పేస్ కలిగి ఉంటుంది. ఈ భూమి విక్రయానికి ఇంటర్నేషనల్ ప్రాపర్టీ అడ్వైజరీ సంస్థ జేఎల్‌ఎల్‌ను కాగ్నిజెంట్ నియమించుకున్నది. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా విక్రయం పూర్తవుతుందని భావిస్తున్నారు.
జీఎస్టీ రోడ్డులోని తంబారానికి సమీపాన గల ఎంఈపీఎస్ క్యాంపస్‌లోకి కాగ్నిజెంట్ తన హెడ్ క్వార్టర్స్‌ను మరలించే అవకాశాలు ఉన్నాయి. పొదుపు చర్యల్లో భాగంగా కాగ్నిజెంట్.. చైన్నైలోని మరో రెండు కేంద్రాల్లో గల లీజ్ స్పేస్‌లను వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. ఎంఈపీజడ్-షోలింగానల్లూర్, సిరుసెరి, ఆర్ఏ పురంలోని సెయింట్ మేరీ రోడ్ ఆఫీసు భవనాలను విక్రయించాలని.. చెన్నైలోని తన కార్యకలాపాలను ఒకే ఆఫీసుకు తరలించాలని కాగ్నిజెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రధాన కార్యాలయం విక్రయానికి చర్యలు చేపట్టిన జేఎల్ఎల్.. స్థానిక డెవలపర్లు భాష్యం గ్రూప్, కాసాగ్రాండ్ సంస్థలతో సంప్రదింపులు జరిపినా ఓ కొలిక్కి రాలేదు. సంప్రదింపులు ప్రాథమిక దశలో ఉన్నాయని జేఎల్ఎల్ వెల్లడించింది. అధికారికంగా దీనిపై స్పందించడానికి కాగ్నిజెంట్ గానీ, జేఎల్ఎల్ గానీ ముందుకు రాలేదు.
Stocks | రికార్డు గరిష్టాలకు స్టాక్ మార్కెట్లు.. 25 వేలు దాటిన నిఫ్టీ..!
Forex Reserves | జీవిత కాల గరిష్టానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు..!
Air India- Vistara | ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనానికి కేంద్రం ఓకే..
Canada – Immigration Policy | విదేశీ పర్యాటకుల ‘వర్క్ పర్మిట్’ నిలిపేసిన కెనడా.. కారణమిదే..!