దివాళా అంచున కాఫీడే.. ఎందుకంటే..!
దివాళా అంచున కాఫీ డే| గత త్రైమాసికంలో రుణ వాయిదాలు చెల్లించలేక పోయిన కాఫీ డే పై దివాళా పిటిషన్ వేసేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సిద్ధం ...

దేశంలోనే అతిపెద్ద కాఫీ డే చైన్ నెట్వర్క్ (సీడీఈఎల్) దివాళా (bankruptcy) దిశగా అడుగులేస్తున్నది. ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకున్న కాఫీ డే ఎంటర్ ప్రైజెస్.. 2021 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రుణ వాయిదాలను చెల్లించ లేకపోయింది. దీంతో కాఫీ డే సంస్థకు రుణాలిచ్చిన బ్యాంకర్లు.. ఆ సంస్థపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.
రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఇలా కాఫీ డే
బ్యాంకర్లు, ఆర్థిక సంస్థలు ఇచ్చిన రుణాలపై మార్చి త్రైమాసికంలో రూ.280 కోట్ల మేరకు రుణ వాయిదా చెల్లించాల్సి ఉందని ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో కాఫీ డే పేర్కొంది. ద్రవ్య లభ్యత సంక్షోభం వల్ల కాఫీ డే మొత్తం రూ.518 కోట్ల రుణ భారంతో డిఫాల్టర్‌గా మారింది.
రుణ వసూళ్లకు రుణ దాతల చర్యలు
ఈ నేపథ్యంలో కాఫీ డే అనుబంధ సంస్థల నుంచి బ్యాంకర్లు, ఆర్థిక సంస్థలు తమ బకాయిల వసూళ్లకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలొచ్చాయి. తమ వెండింగ్ మిషన్ల బిజినెస్‌ను టాటా గ్రూప్‌కు విక్రయించేందుకు కాఫీ డే ప్రయత్నించింది. కానీ కాఫీ డే చైన్ కంపెనీ మార్కెట్ విలువ ఖరారుపై ఏకాభిప్రాయం కుదరక టాటా గ్రూప్‌తో చర్చలు విఫలమైనట్లు తెలుస్తున్నది.
స్టాక్స్ ట్రేడింగ్‌లో కాఫీ డే సస్పెన్షన్
ఇప్పటికే కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు కాఫీ డే షేర్ల ట్రేడింగ్‌ను స్టాక్ ఎక్స్చేంజీలు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. నగదు లభ్యత సమస్యల వల్లే సంస్థ వ్యవస్థాపకుడు వీ సిద్ధార్ధ.. 2019 జూలైలో అనూహ్య పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తన సూసైడ్‌కు ఇవీ కారణాలంటూ సిద్ధార్థ..
తనపై పీఈ సంస్థలు, రుణ దాతలు, ఆదాయం పన్నుశాఖ అధికారులు ఒత్తిళ్లు తేవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సిద్ధార్థ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2020లో కాఫీ డే స్వయంగా నిర్వహించిన దర్యాప్తులో సంస్థకు 2019 జూలై నాటికి రూ.3,535 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
రుణాల విక్రయానికి జస్టిస్ మంజునాథ్ కమిటీ
కాఫీడే అనుబంధ సంస్థల్లో రూ.842 కోట్లు ఉంటే, మిగతా రూ.2,693 కోట్లు కాఫీ డే సొంతంగా పెట్టుబడులు కలిగి ఉన్నది. మరోవైపు కాఫీ డే సంస్థల్లో వ్యవస్థాపకుడి ఆస్తుల నుంచి రుణాలను రికవరీ చేయడానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేఎల్ మంజునాథ్ సారధ్యంలో కమిటీని నియమించింది.
మైండ్ ట్రీలో వాటాల విక్రయం
ఈ నేపథ్యంలోనే మైండ్ ట్రీ కంపెనీలో తన వాటాను కాఫీ డే రూ. 1975 కోట్లకు విక్రయించి రుణ సంస్థలకు వాయిదాలు చెల్లించింది. తాజాగా కర్ణాటకలోని కాఫీ ఎస్టేట్స్‌ను విక్రయించి రుణ భారం తగ్గించుకోవాలని భావిస్తోంది.
ఇవి కూడా చదవండి:
అంబానీలపై 25 కోట్ల ఫైన్
ఫ్యూచర్-రిలయన్స్ డీల్‌పై సుప్రీంకు అమెజాన్
స్వదేశీ పరిజ్ఞానంతో ఆయిల్ రిగ్గులు
పసిడి పరుగు
భారత్‌లోని 3 నగరాల్లో షోరూంలు తెరుస్తున్న టెస్లా
ఏసీలు, ఎల్ఈడీ లైట్ల కోసం పీఎల్ఐ పథకం
బజాజ్ అలియాంజ్ సరికొత్త బీమా
మహీంద్రాతో ఫ్లిప్‌కార్ట్ డీల్
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- banktrupty
- coffee day
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

