Coca Cola Spiced Flavour : కోక్ కస్టమర్లు త్వరలో తమ ఫేవరెట్ డ్రింక్ స్పైసీ వెర్షన్‌ను ఆస్వాదించనున్నారు. కోకా కోలా ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్‌లు ఈ సంకేతాలను పంపుతున్నాయి. కోకా కోలా తన న్యూ పర్మినెంట్ ఫ్లేవర్ కోకో కోలా స్పైస్డ్ లాంఛ్‌ను ప్రకటించింది.
న్యూ వేరియంట్ డ్రింక్ తమ ఐకానిక్ కోలా, రాస్ప్బెర్రీ, స్పైస్డ్ ఫ్లేవర్ల మేలు కలయికగా ఉంటుందని అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ డ్రింక్ షుగర్, జీరో-షుగర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఫిబ్రవరి 19 నాటికి కెనడా, అమెరికా స్టోర్స్‌లో లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.
చిన్న, మధ్యస్ధాయి కంపెనీలు పంచియర్ ఫ్లేవర్స్‌తో వినియోగదారులను ఆకర్షిస్తుండటంతో పోటీ మార్కెట్ అవకాశాలను ఒడిసిపట్టుకునేందుకు కంపెనీ కోకా కోలా స్పైస్డ్ ఫ్లేవర్‌తో ముందుకొచ్చింది. యువ వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో న్యూ ప్రోడక్ట్‌ను కోకా కోలా లాంఛ్ చేసింది. స్పైస్డ్ కోలా లాంఛ్‌కు సంబంధించి బ్రాండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో హింట్ ఇవ్వగానే నెటిజన్లు భారీగా స్పందించారు. 24 గంటల్లోనే ఈ పోస్ట్ 1.64 లక్షల వ్యూస్‌లను, 10,500 లైక్స్‌ను రాబట్టింది.
Read More :
Repo Rate | వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ