న్యూఢిల్లీ, అక్టోబర్ 24: శీతల పానియాల తయారీ సంస్థ కోక-కోలా..భారత్లో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. సెప్టెంబర్ త్రైమాసికంలో విలువపరంగా చూస్తే రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నట్టు కంపెనీ చైర్మన్, సీఈవో జేమ్స్ క్విన్సీ తెలిపారు. ఆసియా పసిఫిక్తోపాటు వర్థమాన మార్కెట్ల వృద్ధి కంటే భారత్లో అత్యధికంగా ఉంటున్నదని, జూన్ త్రైమాసికం కంటే ఆ తర్వాతి త్రైమాసికంలో రెండంకెల వృద్ధిని సాధించిందని ఆయన చెప్పారు.