Citroen E-C3 | పూర్తిస్థాయి తొలి ఎలక్ట్రిక్ కారు సిట్రోన్ ఈ-సీ3 రెడీ.. కేవలం రూ.11.5 లక్షలే!
Citroen E-C3 | సిట్రోన్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారు ఈ-సీ3 (Citroen E-C3) మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర రూ.11.5 లక్షల నుంచి మొదలవుతుంది.
Citroen E-C3 | దేశీయ మార్కెట్లోకి తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారు `సిట్రోన్ ఈ-సీ3 (Citroen E-C3)` వచ్చేసింది. దీని ధర రూ.11.5 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. నాలుగు ట్రిమ్స్‌లో సిట్రోన్ ఈ-సీ3 (Citroen E-C3) కారు అందుబాటులో ఉంటుందని సిట్రోన్ ఇండియా తెలిపింది. పెట్రోల్ సీ3 కారు మార్కెట్లోకి తీసుకొచ్చిన ఆరు నెలల్లో అదే మోడల్ కారు ఎలక్ట్రిక్ వేరియంట్ కారును యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. కారు బుక్ చేసుకున్న వారికి ఈ వారంలో డెలివరీ ప్రారంభిస్తామని తెలిపింది. దేశంలోని 25 నగరాల పరిధిలో 29 మైసాన్ సిట్రోన్ షోరూమ్ (Maison Citroen showrooms)ల్లో లభిస్తుంది.
ఈ కారు పట్ల ఆసక్తి గల వారు పూర్తిగా ఆన్లైన్ పర్చేజ్ ఆప్షన్స్‌లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జియో-బీపీ అందిస్తున్న డీసీ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ అన్ని షోరూమ్ల్లోనూ అందుబాటులో ఉంటుంది. అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు ఈ చార్జర్ ఉపయోగించుకోవచ్చు.
సిట్రోన్ ఈ-సీ (Citroen E-C3) కారు ధరలు ఇలా
లైవ్ ———————————– రూ.11,50,000
ఫీల్ ———————————– రూ. 12,13,000
ఫీల్ వైబ్ ప్యాక్ ———————- రూ.12,28,000
ఫీల్ డ్యుయల్ టోన్ వైబ్ పాక్ —– రూ.12,43,000
ఇవీ ఫీచర్లు.. స్పెషిఫికేషన్లు
- సిట్రోన్ ఈ-సీ3 (Citroen E-C3) కారు 29.2 కిలోవాట్ల బ్యాటరీతోపాటు పర్మినెంట్ మాగ్నెస్ సింక్రోనస్ (magnet synchronous) మోటార్ కలిగి ఉంది.
- 56 బీహెచ్పీ విద్యుత్, 143 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
- ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు కేవలం 6.8 సెకన్లలోనే 60 కి.మీ వేగం.
- 320 కి.మీ. రేంజ్ ప్రయాణ సామర్థ్యం ఉంటుందని ఏఆర్ఏఐ సర్టిఫికెట్.
- 100 శాతం డీసీ ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యం – 15 ఎంపైర్ (ampere) హోం చార్జింగ్ ఫెసిలిటీ
- 13 ఎక్స్టీరియర్ కలర్ కాంబినేషన్స్‌లో లభ్యం.
- త్రీ ప్యాక్స్ 47 కస్టమైజేషన్స్ ఆప్షన్స్ లభ్యం.
- ఆల్ న్యూ ఈ-సీ3 (Ë-C3) ఎలక్ట్రిక్ కార్లకు మై సిట్రోన్ కనెక్ట్ (MY CITROEN CONNECT) , సీ బడ్డీ (C-BUDDY) యాప్‌లతో కనెక్టివిటీ.
- ఐఓఎస్ & ఆండ్రాయిడ్ (iOS & Android) వర్షన్లు లభ్యం.
- డ్రైవింగ్ బిహేవియర్ అనాలిసిస్, వెహికల్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ సర్వీసెస్ కాల్, ఆటో క్రాష్ నోటిఫికేషన్, ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, యూసేజ్బేస్డ్ ఇన్సూరెన్స్ పారా మీటర్లతోపాటు మై సిట్రోన్ కనెక్ట్ (MY CITROEN CONNECT) లో 35 స్మార్ట్ ఫీచర్లు లభ్యం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jamia Millia Islamia | 14వ రోజుకు జామియా విద్యార్థుల నిరాహార దీక్ష.. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్
Health Tips | మందులో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్టే..!
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

