హైదరాబాద్ (సిటీబ్యూరో), మార్చి 16 (నమస్తే తెలంగాణ): రంగం ఏదైనా సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు నగరంలోని స్టార్టప్ ఇంక్యుబేటర్లు ప్రత్యేకంగా ప్రోత్సాహక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ- సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (సీఐఈ).. వైద్య, ఆరోగ్యానికి సంబంధించి క్లీనికల్ ట్రయల్స్ చేసే మెడిటెక్, హెల్త్ విభాగంలో స్టార్టప్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ట్రిపుల్ ఐటీ -సీఐఈలో మెడిటెక్ విభాగానికి సంబంధించి ప్రత్యేకంగా ఉన్న ఓజాస్ మెడిటెక్ యాక్సిలరేటర్ అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తుంది. వివరాలకు ఈ కింది లింకులో https:// cie.iiit.ac. in/medtech-path-to-clinical-trial/లో సంప్రదించాలి. మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.