హైదరాబాద్, సెప్టెంబర్ 9: కోయంబత్తూరు ఫిల్టర్ కాఫీ(సీఎఫ్సీ).. హైదరాబాద్లో కార్పొరేట్ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్ గోలి గోపి మాట్లాడుతూ..రెండేండ్ల క్రితం తెలుగు రాష్ర్టాల్లో అడుగుపెట్టిన సంస్థ..అనతి కాలంలోనే తెలంగాణతోపాటు ఆంధప్రదేశ్లలో 65 అవుట్లెట్లను ప్రారంభించినట్లు చెప్పారు. వచ్చే రెండేండ్ల కాలంతో తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు 600 స్టోర్లను ఫ్రాంచైజ్ పద్దతిన నెలకొల్పాలనుకుంటున్నట్టు తెలిపారు.