న్యూఢిల్లీ, ఆగస్టు 16: రూ.5 లక్షలకు మించి వార్షిక ప్రీమియం చెల్లింపులు జరిగిన జీవిత బీమా పాలసీలపై పన్ను గణించే నిబంధనల్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) తాజాగా నోటీఫై చేసింది. రూ.5 లక్షల వార్షిక ప్రీమియం చెల్లింపుతో తీసుకునే జీవిత బీమా పాలసీల కాలపరిమితి ముగిసినపుడు వచ్చే మొత్తంపై ఆదాయపు పన్ను విధిస్తూ బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
2023 ఏప్రిల్ 1 తర్వాత జారీఅయిన అటువంటి పాలసీల మెచ్యూరిటీ మొత్తాన్ని పన్ను చెల్లింపుదార్లు అదనపు ఆదాయం కింద చూపాలని, ఆయా వ్యక్తిగత శ్లాబులకు అనుగుణంగా పన్ను పడుతుందని సీబీడీటీ వివరించింది. వార్షిక ప్రీమియం చెల్లింపులు రూ. 5 లక్షల లోపు ఉంటే ఆ పాలసీల మెచ్యురిటీ మొత్తంపై సెక్షన్ 10 (10డీ) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. యులిప్లు మినహా అన్ని జీవిత బీమా పాలసీలపై ఆదాయపు పన్ను విధానాన్ని బడ్జెట్లో మార్చారు. వ్యక్తి మరణించిన తర్వాత కుటుంబీకులకు వచ్చే బీమా ఆదాయాన్ని మాత్రం పన్ను విధానంలో మార్పులేదు. మినహాయింపు లభిస్తుంది.