E-Rupi | ఈ-రూపీ డిజిటల్ వోచర్ వాడకంపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. గురువారం ద్రవ్యపరపతి సమీక్ష ముగిసిన తర్వాత కీలక వడ్డీరేట్లలో ఎటువంటి మార్పుల్లేకుండా.. యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ-రూపీ డిజిటల్ వోచర్ పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఇప్పట వరకు ఈ-రూపీ డిజిటల్ వోచర్‌పై రూ.10 వేల వరకు వాడుకునే వెసులుబాటు ఉండేది.
ఇక నుంచి రూ.10 వేల నుంచి రూ. లక్ష వరకు ఈ-రూపీ డిజిటల్ వోచర్ వాడుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాకు చెప్పారు. అంటే ఆర్బీఐ జారీ చేసిన ఈ-వోచర్‌ను రూ.లక్ష వరకు ఒకటికంటే ఎక్కువ సార్లు ఉపయోగించొచ్చు. ఈ -రూపీ డిజిటల్ వోచర్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) గతేడాది ఆగస్టులో ఆవిష్కరించింది. అప్పట్లో దాని లిమిట్ రూ.10 వేలకే పరిమితం చేసింది. ఒక్కసారి మాత్రమే క్యాష్‌లెస్ పేమెంట్‌కు అనుమతించింది.
ఎన్పీసీఐ ఆవిష్కరించిన క్యాష్‌లెష్ ఈ-రూపీ డిజిటల్ ఓచర్‌తో పలు రకాల ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు మరింత సమర్థవంతంగా సేవలందించవచ్చు. అన్ని రకాల ప్రభుత్వ పథకాలూ ఎన్పీసీఐ ద్వారానే జరుగుతున్నాయి.