ముంబై, డిసెంబర్ 21: నాట్కో ఫార్మా జెనెరిక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ డ్రగ్‌పై యూఎస్‌లో దాఖలు చేసిన యాంటి-ట్రస్ట్ దావాను అక్కడి సంస్థ ఉపసంహరించుకుంది. క్యాన్సర్ చికి త్సా ఔషధం పొమాలిడొమైడ్కు సంబంధించి నాట్కో ఫార్మా, బ్రెకన్రిడ్, బ్రిస్టల్ మేయర్స్ స్కిబ్, సెల్జీన్ తదితర కంపెనీలపై లూసియానా హెల్త్ సర్వీస్ అండ్ ఇండిమ్నిటీ కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో యాంటి ట్రస్ట్ కేసు వేసింది. యూఎస్‌లో పొమాలిడొమైడ్ క్యాప్సుల్స్‌కు బ్రెకెన్రిడ్జ్ అండా హోల్డర్ అని, తమ మార్కెటింగ్ పార్టనర్ అని, ఈ నేపథ్యంలో ఈ కేసు నుంచి తమ రెండు కంపెనీలను దావా వేసిన సంస్థ స్వచ్ఛందంగా తొలగించిందని గురువారం నాట్కో ఫార్మా స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది., నాట్కో ఉత్పత్తిచేసిన పొమాలిడొమైడ్ క్యాప్సుల్స్‌ను యూఎస్‌లో ఇంకా విడుదల చేయలేదు.