హైదరాబాద్, జూన్ 23:ప్రభుత్వరంగ ఆర్థిక సేవల సంస్థ కెనరా బ్యాంక్ గడిచిన ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన రూ.6.50(65 శాతం) డివిడెండ్‌కు బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. 20వ సాధారణ సర్వసభ్య సమావేశంలో షేరు హోల్డర్లు ఈ నిర్ణయానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశానికి కెనరా బ్యాంక్ ఎండీ ఎల్వీ ప్రభాకర్‌తోపాటు పలువురు బ్యాంక్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.