ముంబై, అక్టోబర్ 14 : ప్రస్తుతం ఎక్కడ చూసిన బంగారం ధరల ముచ్చటే. ఎవర్నీ కదిలించిన గోల్డ్ ధరలు ఎట్లా పెరుగుతున్నాయో అని ఆందోళన. దీనిపై ఆర్పీజీ గ్రూపు చైర్మన్ హర్ష గోయెంకా కీలక వ్యాఖ్యలు చేశారు. 1990లో కిలో బంగారం విలువ మారుతి 800తో పోల్చిన ఆయన.. 2025 నాటికి దీని విలువ ల్యాండ్ రోవర్ కారుతో పోల్చారు. అలాగే 2030 నాటికి కిలో గోల్డ్ విలువ రోల్స్ రాయిస్ కారు వస్తున్నదన్న ఆయన..
2040 నాటికి కిలో గోల్డ్ విలువ రాకెట్ వేగంతో దూసుకుపోయి ప్రైవేట్ జెట్ విమానాన్ని కొనుగోలు చేయవచ్చునని తన ఎక్స్‌లో పేర్కొన్నారు. గడిచిన ఏడాదికాలంలో పుత్తడి విలువ 52 శాతం ఎగబాకింది. అలాగే 2022 నుంచి ఇప్పటి వరకు 140 శాతం పెరిగింది. అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా షట్‌డౌన్ కారణంగా మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన పుత్తడి వైపు మళ్లించడంతో వీటి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి.
1990లో కిలో గోల్డ్ = మారుతి 800
2000లో కిలో గోల్డ్ = మారుతి ఎస్టీమ్
2005లో కిలో గోల్డ్ = టయోటా ఇన్నోవా
2010లో కిలో గోల్డ్ = టయోటా ఫార్చ్యూనర్
2019లో కిలో గోల్డ్ = బీఎండబ్ల్యూ
2025లో కిలో గోల్డ్ = ల్యాండ్ రోవర్
2030లో కిలో గోల్డ్ = రోల్స్ రాయిస్
2040లో కిలో గోల్డ్ = ప్రైవేట్ జెట్