Bugatti Footwear | హైదరాబాద్, అక్టోబర్ 9: యూరప్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఫుట్‌వేర్ బ్రాండ్ బుగాటీ.. తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తమ తొలి అవుట్‌లెట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. దీంతో సంస్థ దక్షిణాది మార్కెట్లోకి ప్రవేశించినైట్టెంది. నగరంలో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను రాష్ట్ర ఐటీ ప్రీన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని, ఇప్పటికే ఐటీ, ఇతర సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడుతుండగా, తాజాగా గ్లోబల్ బ్రాండైన బుగాటీ కూడా పెట్టుబడి పెట్టడం మంచి పరిణామమన్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఆరు నెలల్లో హైదరాబాద్‌లో మరో స్టోర్‌ను ప్రారంభించనున్నట్టు కంపెనీ రిటైల్ హెడ్, సీవోవో సందీప్ బక్షీ తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ, ఇండోర్‌లో స్టోర్లు ఉండగా.. భవిష్యత్తులో వైజాగ్, రాజమండ్రిలో కూడా ఏర్పాటు చేయనున్నట్టు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.