BSNL Shock | కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న లైఫ్‌టైం ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎత్తివేసింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఈ లైఫ్‌టైం ప్రీపెయిడ్ ప్లాన్లు రద్దవుతాయని తెలిపింది. ఇప్పుడు లైఫ్‌టైం ప్రీపెయిడ్ కస్టమర్లను మరో ప్లాన్‌లోకి బదిలీ చేస్తామని వివరించింది. యూజర్లు ఇప్పుడు పొందుతున్న బెనిఫిట్లు ఏమాత్రం నష్టపోకుండా మరో ప్లాన్‌లోకి షిఫ్ట్ చేస్తుంది.
లైఫ్ టైమ్ ప్లాన్‌ను రూ.107 ప్లాన్‌లోకి మార్చేస్తుంది. ఈ ప్లాన్ కాల పరిమితి మూడు నెలలు మాత్రమే. లైఫ్ టైం ప్లాన్ ఖాతాదారులకు రూ.107 ప్లాన్‌లో లభించే అదనపు బెనిఫిట్లు వర్తించవు. ఇక రూ.2,399తో అందిస్తున్న వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ మరో 60 రోజులు పెంచుతూ బీఎస్ఎన్ఎల్ నిర్ణయం తీసుకుంది. అంటే వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ ఎంచుకున్న బీఎస్ఎన్ఎల్ ఖాతాదారులు 425 రోజుల వ్యాలిడిటీ పొందుతారు.