BSNL | ప్రముఖ ప్రభుత్వ టెలికం రంగ సంస్థ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సరికొత్త ప్లాన్‌తో యూజర్ల ముందుకు వచ్చింది. ఇటీవల కాలంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు రీచార్జ్ ప్లాన్‌ను భారీగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఎస్ఎన్ఎల్ సైతం యూజర్లను పెంచుకునేందుకు ఆకర్షణీయమైన ప్లాన్‌ని తీసుకువస్తున్నది. తాజాగా రూ.347 ప్లాన్‌ని ప్రకటించింది. ఇందులో యూజర్లకు 54 రోజుల వ్యాలిడిటీ లభించనున్నది. అంతే కాకుండా 54 రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకునేందుకు అవకాశం ఉంది.
అలాగే, రోజుకు వంద ఎస్ఎంఎస్లు, రోజుకు 5జీబీ డేటాతో పాటు అదనంగా మరో 3 జీబీడేటా ఫ్రీగా ఇవ్వనున్నది. 54 రోజులకు 162, అదనంగా 3జీబీ డేటా కలిపి మొత్తం 165 జీబీ డేటా యూజర్లకు లభించనున్నది. హార్డీ, చాలెంజర్ ఎరీనా గేమ్స్, గేమాన్, ఆస్ట్రోటెల్, గేమియం, జింగ్ మ్యూజిక్, వావ్ ఎంటర్టైన్మెంట్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, లిస్టిన్ పాడ్‌కాస్ట్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగానే లభించనున్నది. మరో వైపు బీఎస్ఎన్ఎల్ యూజర్లకు 4జీ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నది. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు నగరాల్లో 4జీ సేవలను ప్రారంభించింది. మిగతా నగరాల్లో దశలవారీగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. 4జీ సేవలు అందుబాటులో 5జీ సేవలు ప్రారంభించబోతున్నది.