కోల్కతా, ఆగస్టు 5: మరోసారి ధరలు పెంచడానికి సిద్ధమైంది బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్. ముడి సరుకుల ధరలతోపాటు కోకా, చక్కెర ధరలు అధికమవడంతో తమ ఉత్పత్తుల ధరల పెంచకతప్పడం లేదని బ్రిటానియా వైస్ చైర్మన్, ఎండీ వరుణ్ బెర్రీ తెలిపారు. ఏయే బ్రాండ్ల ధరలు పెంచేదానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, ఈ ముడి సరుకులు అత్యధికంగా వినియోగిస్తున్న ఉత్పత్తులను అతి త్వరలో పెంచనున్నట్లు చెప్పారు.
ధరలు పెంచితే అమ్మకాలపై స్వల్పంగా ప్రభావం చూపే అవకాశం ఉన్నదని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత కస్టమర్లు చౌకైన ఉత్పత్తులవైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందని కొత్తగా 28 లక్షల అవుట్లెట్లకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.