న్యూఢిల్లీ, మే 21 : మెలోడీ టోఫీ చాక్లెట్ల ఉత్పత్తిని పార్లే ప్రొడక్ట్స్ పెంచేసింది. విదేశీ పర్యటనలో ప్రధాని మోదీ.. ఇటలీ ప్రధాని మెలోనీకి ఈ మెలోడీ చాక్లెట్ల ప్యాకెట్‌ను బహుమతిగా ఇచ్చినది తెలిసిందే. ఆ వీడియో వైరల్ కావడంతో సదరు చాక్లెట్లకు ఇప్పుడు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో చాక్లెట్ల తయారీని పార్లే పెంచింది.
కాగా, మెలోనీ, మోదీ ఇరువురి పేర్లను కలిపితే వచ్చే సంక్షిప్త రూపంగా మెలోడీ ఉండటంతోనే మోదీ గిఫ్ట్ ఇవ్వగా.. ఇదీ కంపెనీకి లాభిస్తున్నది. ఇక బుధవారం స్టాక్ మార్కెట్లో చాక్లెట్లను తయారు చేస్తున్నది పార్లే ఇండస్ట్రీస్ లిమిటెడేనని భావించి మదుపర్లు ఆ కంపెనీ షేర్లను ఎగబడి కొనేశారు.