All New Hyundai Verna | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా న్యూ జనరేషన్ హ్యుండాయ్ వెర్నా కార్ల కోసం ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ నెల 21న న్యూ జనరేషన్ వెర్నా కారును దేశీయ మార్కెట్లో ఆవిష్కరిస్తామని ప్రకటించింది. న్యూ జనరేషన్ వెర్నా కారు.. ఇటీవలే మార్కెట్లో ఎంటరైన హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌కు గట్టి పోటీ ఇవ్వనున్నది. ఆల్ న్యూ హ్యుండాయ్ వెర్నా పూర్తిగా ఫ్యూచరిస్టిక్ న్యూ డిజైన్‌తో వస్తున్నది. చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న ఆల్ న్యూ వెర్నా కారును వచ్చే నెలలో కస్టమర్లకు డెలివరీ ప్రారంభించనున్నట్లు హ్యుండాయ్ మోటార్ వెల్లడించింది. రూ.25 వేలు చెల్లించి కారు బుకింగ్స్ చేసుకోవచ్చునని ఇంతకుముందే తెలిపింది.