ఆజాద్‌కు బోయింగ్ ఆర్డర్

- హైదరాబాదీ సంస్థకు ప్రతిష్ఠాత్మక కాంట్రాక్ట్
- విమాన కీలక విడిభాగాల తయారీ, సరఫరా
హైదరాబాద్, జూలై 26: హైదరాబాద్‌కు చెందిన ఆజాద్ ఇంజినీరింగ్ సంస్థ ప్రతిష్ఠాత్మక కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నది. విమానయాన పరిశ్రమలో వినియోగించే సూపర్‌క్రిటికల్ రొటేటింగ్ విడిభాగాలను కంపెనీ తయారు చేస్తున్నది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ విమానయాన దిగ్గజ సంస్థ బోయింగ్ నుంచి కీలక విమాన విడిభాగాల తయారీ, సరఫరా కోసం ఆజాద్‌కు ఆర్డర్ వచ్చింది. ఈ మేరకు సోమవారం ఆజాద్ ఇంజినీరింగ్ ప్రకటించింది. గడిచిన కొన్నేండ్లుగా సంస్థ సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఖచ్చితత్వంతో కూడిన నాణ్యమైన, సురక్షితమైన విడిభాగాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆర్డర్లను పొందుతూ పరిశ్రమలో నమ్మకాన్ని సంపాదించింది. ఈ నేపథ్యంలోనే బోయింగ్ నుంచి కాంట్రాక్ట్ సొంతం చేసుకున్నది.
వచ్చే ఏడాది నుంచి సరఫరా
వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నుంచి బోయింగ్‌కు హైడ్రాలిక్, మెకానికల్ ఫిట్టింగ్స్ తదితర కీలక విడిభాగాల సరఫరాను ప్రారంభిస్తామని ఆజాద్ ఇంజినీరింగ్ తెలిపింది. టర్బైన్, ఏరోస్పేస్ ఇండస్ట్రీ కోసం క్లిష్టమైన, అత్యంత కీలకమైన విడిభాగాలు, యాంత్రిక పరికరాలను తయారుచేసే సామర్థ్యం ఆజాద్ ఇంజినీరింగ్‌కు ఉందని ఈ సందర్భంగా కంపెనీ వర్గాలు గుర్తుచేశాయి.
హైదరాబాద్‌లో మరో ప్లాంట్
దాదాపు రూ.600 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో రెండో తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు ఆజాద్ ఇంజినీరింగ్ ప్రకటించింది. ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం రాబోయే మూడేండ్లకుపైగా కాలంలో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ ప్లాంట్.. ఓ ఆధునిక ఇంజినీరింగ్ క్లస్టర్‌గా ఉంటుందన్న సంస్థ.. రాష్ట్రంలో నైపుణ్యం గల యువతకు మెరుగైన ఉద్యోగావకాశాలుంటాయని చెప్పింది. తెలంగాణ అభివృద్ధికి, ఇక్కడి ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ ఉన్నతికి కృషి చేస్తామని ఆజాద్ ఇంజినీరింగ్ ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.
‘బోయింగ్‌తో పనిచేయడానికి మేము గర్వపడుతున్నాం. మా నాణ్యత, నిబద్ధత, విశ్వసనీయతలకు ఈ కాంట్రాక్టు నిదర్శనం. తెలంగాణలో నానాటికీ బలపడుతున్న ఏరోస్పేస్ ఎకోసిస్టమ్‌లో ఆజాద్ ఇంజినీరింగ్, బోయింగ్‌ల ఒప్పందం ఓ మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు’
-రాకేశ్ చోప్దర్, ఆజాద్ ఇంజినీరింగ్ ఎండీ
‘ఆత్మనిర్భర్ భారత్ సాధనకు బోయింగ్ కట్టుబడి ఉన్నది. అందుకు సంబంధించి సంస్థ లక్ష్యాల్లో ఇదో గొప్ప ముందడుగు. దేశంలో బోయింగ్ కార్యకలాపాలు 70 ఏండ్లకు ముందు నుంచే మొదలయ్యాయి. స్వదేశీ ఏరోస్పేస్ అభివృద్ధి, డిఫెన్స్ సామర్థ్యాలకు సంస్థ ఎంతగానో మద్దతునిస్తున్నది’
-అశ్వనీ భార్గవ, బోయింగ్ ఇండియా సరఫరా వ్యవస్థ నిర్వహణ డైరెక్టర్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

