హైదరాబాద్/ముంబై, డిసెంబర్ 18: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ).. విద్యార్థుల సాధికారత కోసం ఆకర్షణీయమైన ఆఫర్లతో ‘బ్రో’ పేరిట ఓ సేవింగ్స్ ఖాతాను పరిచయం చేసింది. 16-25 ఏండ్లవారు అర్హులు. విద్యార్థుల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. ఇక ఈ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ నిబంధన వర్తించదు.
అలాగే ఖాతాదారులు ఎలక్ట్రానిక్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ట్రావెల్, ఫుడ్, ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్, లైఫ్‌ైస్టెల్, గ్రాసరీ, హెల్త్‌కు సంబంధించిన లావాదేవీల్లో గొప్ప ఆఫర్లు అందుకునేలా ఓ లైఫ్‌టైమ్ ఫ్రీ రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డును బ్యాంక్ ఇస్తున్నది. అంతేగాక దేశంలోని విమానాశ్రయాల్లో ప్రోత్సాహక లాంజ్ యాక్సెస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. 3 నెలలకు 2 అనుమతులుంటాయి. సమీపంలోని బీవోబీ శాఖను సంప్రదించి ఈ బ్రో ఖాతాను అర్హులైన విద్యార్థులు తీసుకోవచ్చని బ్యాంక్ ఓ ప్రకటనలో తెలియజేసింది.
బ్రో ఖాతా ప్రత్యేకతలు