BMW EV Cars | దేశీయ విపణిలోకి విద్యుత్ కార్లను తీసుకొచ్చే విషయంలో జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ దూకుడుగా వ్యవహరిస్తోంది. వచ్చే ఆరు నెలల్లో మూడు ఎలక్ట్రిక్ కార్లను తేనున్నట్లు బీఎండబ్ల్యూ భారత్ ప్రెసిడెంట్ కం సీఈవో విక్రమ్ పావహ్ చెప్పారు. వీటిల్లో ఒక ఎస్యూవీ, మినీ లగ్జరీ హ్యాచ్‌బ్యాక్, సెడాన్ ఉంటాయని ఆ కంపెనీ తెలిపింది. వచ్చే 180 రోజుల్లో పూర్తి ఎలక్ట్రిక్ కార్లు తెస్తున్నామని విక్రమ్ పావహ్ తెలిపారు.
వచ్చే నెల రోజుల్లో ఐఎక్స్ (iX) పేరుతో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొస్తామని బీఎండబ్ల్యూ తెలిపింది. మూడు నెలల్లో మినీ ఎలక్ట్రిక్, ఆరు నెలల్లో సెడాన్ (i4) కారు తీసుకొస్తున్నామని అని పావహ్ తెలిపారు. ఐఎక్స్ మోడల్‌ను ఇప్పటికే అమెరికా, యూరప్ మార్కెట్లలో విడుదల చేశామని చెప్పారు. వీటికి ఇంట్లో ఛార్జింగ్‌కు వీలుగా హోమ్ ఛార్జింగ్ కిట్ కూడా బీంఎండబ్ల్యూ అందిస్తుంది. దేశంలోని 35 నగరాల్లో డీలర్ నెట్వర్క్ వద్ద ఫాస్ట్ ఛార్జర్లను ఏర్పాటు చేసింది.