న్యూఢిల్లీ, డిసెంబర్ 19: బీఎండబ్ల్యూ అనుబంధ ద్విచక్ర వాహన సంస్థ బీఎండబ్ల్యూ మోటార్రాడ్ ఇండియా..తన వాహన ధరలను ఆరు శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. పెరిగిన ధరలు వచ్చే నెల ఒకటి నుంచి అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది.
డాలర్, యూరో కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనం కావడంతోపాటు ఉత్పత్తి వ్యయం పెరుగడంతో సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలు పెంచాల్సి వస్తున్నదని బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్, సీఈవో హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు. ప్రస్తుతం సంస్థ రూ.2.81 -48.63 లక్షల్లోపు ధర కలిగిన పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది.