న్యూఢిల్లీ, జూన్ 22: విద్యుత్‌తో నడిచే వాహనాల్లో భద్రత ప్రమాణాలు మెరుగుపరచడంతోపాటు నాణ్యమైన వాహనాలు అందించడానికి ది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సరికొత్తగా రెండు ప్రమాణాలను జారీ చేసింది. ఐఎస్ 18590: 2024, ఐఎస్ 18606:2024తో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల్లో భద్రత ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎల్, ఎం, ఎన్ విభాగాలను రూపొందించింది. డ్రైవర్లు, ప్రయాణికులకు భద్రత విషయంలో పెద్దపీట వేయడంలో భాగంగా ఈ నూతన మార్గదర్శకాలను రూపొందించింది.