హైదరాబాద్, ఏప్రిల్ 30: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) 2026-28 ఆర్థిక సంవత్సరాలకుగాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. నూతన అధ్యక్షుడిగా యాపెన్ ఇండియా జనరల్ మేనేజర్ బిపిన్ పెండ్యాల ఎంపికయ్యారు.
హైదరాబాద్‌లో గురువారం 34వ సాధారణ వార్షిక సమావేశమై నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ప్రశాంత్ నందెళ్ల స్థానంలో బిపిన్ పెండ్యాల నియమితులయ్యారు. ఏఐ, డాటా, ప్రొడక్ట్ ఇంజినీరింగ్, గ్లోబల్ టెక్నాలజీ సర్వీసెస్‌లో ఆయనకు రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్నది. అలాగే వైస్ ప్రెసిడెంట్‌గా ఇసాక్ రాజ్‌కుమార్, జనరల్ సెక్రటరీగా జితేంద్ర పుచ్చ ఎంపికయ్యారు.