న్యూఢిల్లీ, జూన్ 22: ఆంధ్రప్రదేశ్‌లో బయోకాన్‌కు ఉన్న ప్లాంట్‌పై అమెరికా నియంత్రణ మండలి అభ్యంతరాలు వ్యక్తంచేసింది. ఏపీలోని విశాఖపట్నం వద్ద ఉన్న ఏపీఐ ప్లాంట్(సైట్ 5)ను ఇటీవల తనిఖీ చేసిన అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(యూఎస్ఎఫ్డీఏ) ఉన్నతాధికారులు ఈ యూనిట్‌పై నాలుగు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఇందుకు సంబంధించి ఫామ్ 483(అబ్జర్వేషన్)కు జారీ చేసినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.