Adani into Health Care | ఆసియా కుబేరుడు గౌతం అదానీ ఒక్కో అడుగు ముందుకేస్తూ వెళుతున్నారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రోడ్లు, రిటైల్.. ఎనర్జీ.. సిమెంట్ తదితర రంగాల్లో వ్యాపార లావాదేవీలు ప్రారంభించిన గౌతం అదానీ.. తాజాగా హెల్త్‌కేర్ రంగంలోకి ఎంటరయ్యారు. ఆయన సారధ్యంలోని అదానీ గ్రూప్.. హెల్త్‌కేర్ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది.
అదానీ గ్రూప్‌లోని అదానీ ఎంటర్ప్రైజెస్.. పూర్తిగా అనుబంధ సంస్థ అదానీ హెల్త్ వెంచర్స్ లిమిటెడ్ (ఏహెచ్‌వీఎల్)ను ఏర్పాటు చేసింది. ఈ నెల 17న అదానీ హెల్త్ వెంచర్స్ ఏర్పాటు చేసినట్లు బుధవారం ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇందుకోసం రూ.లక్ష షేర్క్యాపిటల్ ఏర్పాటు చేసింది.
అదానీ హెల్త్ వెంచర్స్ ద్వారా మెడికల్ అండ్ డయాగ్నస్టిక్స్ ఫెసిలిటీస్, హెల్త్ ఎయిడ్స్, హెల్త్ టెక్ బేస్డ్ ఫెసిలిటీస్, రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నది. త్వరలో బిజినెస్ ఆపరేషన్స్ నిర్వహిస్తామని తెలిపింది.