హైదరాబాద్, డిసెంబర్ 14: ప్రముఖ మొబైల్ రిటైల్ దిగ్గజం బిగ్ ‘సి’..21వ వార్షికోత్సవ సంబురాలు జరుపుకుంటున్నది. ప్రతి పండుగ, ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని వినూత్న ఆఫర్లను ప్రకటించడం అనవాయితీగా వస్తున్నదని, ఈసారి మాత్రం మూడు సంచలనాత్మక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ సీఎండీ బాలు చౌదరి తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి రూ.1.10 లక్షల వరకు హెల్త్‌కేర్ ప్రయోజనాలు పొందవచ్చునని చెప్పారు.
ఈ ఆఫర్లో భాగంగా ఏడాది పాటు అపరిమిత టెలి ఫోనిక్ డాక్టర్ కన్సల్టేషన్, ప్రమాద బీమా కవరేజ్, మందులపై 20 శాతం వరకు రాయితీ, రూ.5 వేల వరకు అంబులెన్స్ సదుపాయం ఉచితంగా లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా అందిస్తున్న తొలి ఆఫర్ ఇదేనన్నారు. అలాగే రూ.75 వేల విలువైన పేటీఎం కూపన్లతో ఎంటర్టైన్మెంట్, డైనింగ్, ట్రావెలింగ్, వినియోగ వస్తువులు, వెల్నెస్, షాపింగ్‌కు సంబంధించిన ప్రయోజనాలు పొందవచ్చునని చెప్పారు.
ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసిన వారికి రూ.2కే రూ.4,999 విలువైన ఫైర్‌బోల్ట్ స్మార్ట్‌వాచ్ లేదా రూ.2,999 విలువైన రెడ్మీ బడ్స్‌ను సొంతం చేసుకోవచ్చును. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చునని ఆయన పేర్కొన్నారు. గతేడాది రూ.950 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాల్లో 250కి పైగా రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్నది.