Neerav Modi | నీరవ్‌మోదీకి బిగ్బ్లో.. చీటింగ్ చేశాడని అమెరికా కోర్టు నిర్ధారణ
Neerav Modi | చీటింగ్ కేసులో పీఎన్బీ స్కామ్ నిందితుడు నీరవ్‌మోదీకి అమెరికా దివాళా కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Neerav Modi | పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) స్కామ్‌లో పరారీలో ఉన్న నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ ( Nirav Modi )కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్‌మోదీ, ఆయన ఇద్దరు సహచరులు తమపై మోపిన ఫొర్జరీ అభియోగాలను కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికా.. న్యూయార్క్ దివాళా ( bankruptcy court ) న్యాయస్థానం గత శుక్రవారం తిరస్కరించింది. మోదీ యాజమాన్యంలోని ఫైర్‌స్టార్ డైమండ్, ఫాంటసీ ఇంక్, ఏ జెఫ్ అనే సంస్థలు మోసగించాయని వాటి (కోర్టు నియమించిన) ట్రస్టీ రిచర్డ్ లెవిన్ ఆరోపించారు. తమకు జరిగిన నష్టాలకు నీరవ్‌మోదీ, ఆయన సహచరులు మిహిర్ భన్సాలీ, అజయ్ గాంధీ నుంచి కనీసం 15 మిలియన్ల డాలర్ల పరిహారం ఇప్పించాలని లెవిన్ కోరారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తోపాటు ఇతర బ్యాంకుల నుంచి 100 కోట్ల డాలర్లు స్వాహా చేసేందుకు నీరవ్ మోదీ కుట్ర చేశారని భారత్-అమెరికా న్యాయవాది రవి భాత్రా ఆరోపించారు. తన లాభాలను పెట్టుబడిగా పెట్టడంతో మోదీ తన కంపెనీ షేర్ల విలువ పెంచుకోవడానికి ప్రయత్నించాడన్నారు. తదుపరి తన కంపెనీల ఖాతాల నుంచి నగదు ఉపసంహరించి.. వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నాడని ఆరోపించారు. సాధారణ లావాదేవీల మాదిరిగా వాటిని రికార్డుల్లో చూపారని చెప్పారు.
విదేశాల నుంచి ఆభరణాల దిగుమతి కోసం ఫేక్ లెటర్ ఆఫ్ ఇండెంట్ల పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇతర బ్యాంకుల నుంచి రుణాలు, నిధులు పొందేందుకు కుట్ర చేశారని రవిభాత్ర ఆరోపించారు. నీరవ్ మోదీ.. అతడి ఇద్దరు సహచరులు హాంకాంగ్, దుబాయ్‌ల్లో గుల్ల కంపెనీలు ఏర్పాటు చేసి ఫేక్ దిగుమతి ట్రాన్సాక్షన్స్ రికార్డు చేశారన్నారు. మనీ లాండరింగ్ పాల్పడ్డారని చెప్పారు. విచారణపై జడ్జి స్పందిస్తూ.. నీరవ్‌మోదీ మోసం వల్ల పీఎన్బీ.. 100 కోట్ల డాలర్లకు పైగా నష్టపోయిందని వ్యాఖ్యానించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- neerav modi
- PNB Scam
- US Court
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

