నాలుగు ఐటీ దిగ్గజాల్లో తొలి ఆరు నెలల్లో లక్ష మంది టెకీలకు చోటు!

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో నాలుగు దేశీ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఏకంగా లక్ష మంది ఉద్యోగులను హైర్ చేసుకున్నాయి. 2019-20తో పోలిస్తే ఈ నియామకాలు రెట్టింపు కాగా, కరోనా మహమ్మారి ప్రబలంగా ఉన్న 2020-21 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఇది ఏకంగా 13 రెట్లు అధికం. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ప్రధమార్ధంలో నాలుగు ఐటీ కంపెనీలు కలిసి 1,02,234 మందిని రిక్రూట్ చేసుకున్నాయి. ఐటీ సేవలకు డిమాండ్ గణనీయంగా మెరుగుపడిందనేందుకు నూతన టెకీల నియామకం విస్పష్ట సంకేతమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

హైరింగ్ జోరు పెరగడంతో వలసల పర్వం కూడా ఊపందుకుంటుండగా నియామకాలను గతంలో ఎన్నడూ లేనంతగా కంపెనీలు ముమ్మరంగా చేపడుతున్నాయి. ఇక ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ ఇప్పటివరకూ 19,998 మంది ఉద్యోగులను నియమించుకోగా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 18,657 మందిని విధుల్లోకి తీసుకుంది. విప్రో కొత్తగా 23,650 మందిని హైర్ చేసింది. ఇక ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఈ నాలుగు దిగ్గజ కంపెనీలు కలిపి తాజా అంచనాల ప్రకారం 1,60,000 మందిని నియమించుకోవాలని యోచిస్తున్నాయి. భారత్లో పనిచేస్తున్న టెకీల్లో 25 శాతం పైగా ఈ నాలుగు కంపెనీల్లోనే పనిచేస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా యువరాజ్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

