న్యూఢిల్లీ, జూన్ 12: ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్..జీఎస్కే పీఎల్సీతో జట్టుకట్టింది. ప్రధానంగా ఐదేండ్లలోపు పిల్లలను ప్రభావితం చేస్తున్న తీవ్రమైన బ్యాక్టీరియల్ డయేరియా షిగెల్లోసిన్ను పరిష్కరించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పాటునందించనున్నదని ఇరు సంస్థలు ప్రకటించాయి.
డయేరియా వ్యాధికి కారణమవుతున్న షిగెల్లా అనే బ్యాక్టీరియాతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభావితం అవుతున్నారు.