No Cost EMI | నో-కాస్ట్ ఈఎంఐతో బెనిఫిట్లు.. ఈ టిప్స్ పాటించాకే నిర్ణయం తీసుకోవాలి..!
No Cost EMI | నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవడంతో బెనిఫిట్లు ఉన్నా.. పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతే వస్తువులు కొనుగోలు చేయడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
No Cost EMI | ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంట్లో తమకు అవసరమైన వస్తువుల కొనుక్కోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంటి అవసరాలకు ఉపయోగించే వాషింగ్ మిషన్, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మొబైల్ ఫోన్లు ఇతర వస్తువుల ధర కాసింత ఎక్కువే ఉంటుంది. అందరూ ఆయా వస్తువుల ధర మొత్తం చెల్లించి కొనలేరు. అటువంటి వారి కోసం పలు సంస్థలు నో కాస్ట్ ఈఎంఐ అనే పాపులర్ ఫెసిలిటీ కల్పించాయి. నో-కాస్ట్ ఈఎంఐతో బెనిఫిట్లు ఉన్నా, కొన్ని కీలక అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
నో-కాస్ట్ ఈఎంఐ పలు రకాలుగా కస్టమర్లకు లభ్యం అవుతుంది. రెగ్యులర్ ఈఎంఐతో వస్తువు కొనుగోలు చేసినప్పుడు దానిపై ఉన్న రాయితీ బెనిఫిట్ మీ ఖాతాకు బదిలీ అవుతుంది. ఒకవేళ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం బెనిఫిట్ తీసేస్తారు. అప్పుడు వస్తువు ధర మొత్తం పే చేయాలి.
ఉదాహరణకు 10 శాతం డిస్కౌంట్ తర్వాత ఒక వస్తువు ధర రూ.9000 ఉంటే.. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే రూ.9900 పలుకుతుంది. అంటే సదరు వస్తువు ధర రూ.9,900 అన్నమాట. ఒక వస్తువు ధర రూ.10000 ఉన్నప్పుడు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుని వస్తువు కొంటే, దాని ధరలోనే వడ్డీ కలగలిసి పోతుంది. అలా రూ.2000 పెరిగితే రూ.12000 వాయిదాల వారీగా పే చేయాలి. మరో ఆప్షన్ ప్రకారం ప్రాసెసింగ్ ఫీజుల రూపంలో కంపెనీలు వసూలు చేస్తాయి.
ఖరీదైన వస్తువులు కొనేటప్పుడు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో బెనిఫిట్లు ఉంటాయి. ఒకేసారి మొత్తం ధర చెల్లించలేని వారు ఈ ఫెసిలిటీ వాడుకోవచ్చు. ఒక్కోసారి క్రెడిట్ కార్డు ద్వారా నో-కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీని వాడుతుంటే సంబంధిత సంస్థలు మరో రూపంలో రాయితీ ఆఫర్ చేస్తాయి.
సకాలంలో నో-కాస్ట ఈఎంఐ పే చేయకుంటే సిబిల్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. కనుక ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటున్నప్పుడే.. చెల్లించే కెపాసిటీ ఉందా.. లేదా.. అనే విషయం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటే సరి.. అప్పుడు ఎగవేతకు పాల్పడే అవకాశం ఉండదు.
నో కాస్ట్ ఈఎంఐలో వడ్డీని వస్తువు ధరలో కలిపేసి గానీ, ప్రాసెసింగ్ చార్జీల రూపంలో గానీ వసూలు చేస్తారు. రెగ్యులర్ ఈఎంఐ లోన్‌లో ప్రతి నెలా వాయిదాలో వడ్డీ స్పెషల్‌గా ప్రస్తావిస్తారు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నప్పుడు వర్తించే చార్జీల గురించి ముందే తెలసుకోవాలి. ప్రీ-పేమెంట్ చార్జీలు, ఫైన్ వంటి చార్జీలు ఉంటాయా.. అనే సంగతి చెక్ చేసుకోవాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

