నిర్దేశిత పరిమితిని మించి ఆదాయం ఆర్జిస్తున్నవారు ప్రతీ సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ఐటీఆర్‌లు) వేయడం తప్పనిసరి మాత్రమే కాదు.. గడువు తేదీనాటికల్లా సమర్పించడమూ ప్రధానమే. ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిన గడువు తేదీనాటికి ఐటీఆర్ ఫైల్ చేయడం కేవలం చట్టబద్దమైన అవసరం మాత్రమేనని చాలామంది భావిస్తుంటారు. కానీ సమయానికి రిటర్న్ వేయకపోతే పలు ప్రయోజనాలు కోల్పోతామని గ్రహించరు. టైమ్‌కి మీ ఐటీ రిటర్న్ వేయడంతో ఒనగూడే లాభాలు, నష్టాలు నిపుణులు ఇలా వివరిస్తున్నారు…