హైదరాబాద్, సెప్టెంబర్ 25 : మేనేజ్మెంట్ కన్సల్టింగ్‌లో అతిపెద్ద అంతర్జాతీయ సంస్థయైన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు(బీసీజీ)..భారత్‌లో కొత్తగా ఐదో కార్యాలయాన్ని హైదరాబాద్‌లో తెరిచింది. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా నెలకొల్పినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైల్లో కార్యాలయాలు ఉండగా, తాజాగా హైదరాబాద్‌లో ప్రతిభ కలిగిన టెక్నాలజీ నిపుణులు లభిస్తుండటం వల్లనే ఇక్కడ ఆఫీస్‌ను తెరిచినట్టు బీసీజీ ఇండియా హెడ్ రాహుల్ జైన్ తెలిపారు. భారత్‌లో వ్యాపారం శరవేగంగా వృద్ధిని నమోదు చేసుకుంటుండటం వల్లనే ఈ సెంటర్‌ను నెలకొల్పినట్టు చెప్పారు.