న్యూఢిల్లీ: మీరు బ్యాంకులో పని నిమిత్తం వెళుతున్నారా.. అయితే ఆయా బ్యాంకులకు సెలవు దినాలను పరిగణనలోకి తీసుకుని మీ బ్యాంకు శాఖలను సందర్శించండి. ఎందుకంటే వారాంతపు సెలవులు, పండుగల నేపథ్యంలో శనివారం నుంచి ఐదు రోజులు బ్యాంకులు పని చేయవు. .
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హాలీడే క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో 15 రోజులూ సెలవులే. శనివారం నుంచి ఐదు రోజుల పాటు పని దినాలకు బ్రేక్ రావడంతో కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు ఉద్యోగులు సెలవులను సరదా గడుపనున్నారు.
డెహ్రాడూన్లో శుక్రవారం (జూలై 16) నాడు హరేలా పూజ సందర్భంగా బ్యాంకులు పని చేయలేదు.శనివారం అగర్తలలో యూ టిరోట్ సింగ్ డే, షిల్లాంగ్లో ఖర్చీ పూజ సందర్భంగా బ్యాంకులు మూసే ఉంటాయి.
ఆదివారం కావడంతో ఈ నెల 18న సెలవు. జూలై 19న గ్యాంగ్టక్లో గురు రింపొచే థుంగ్కార్ టెచు ఫెస్టివల్ సందర్భంగా బ్యాంకులు పని చేయవు. ఇక బక్రీద్ కారణంగా ఈ నెల 20న జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురంలలో బ్యాంకులకు హాలీడే.
ఈద్ అల్ అదా సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు 21న సెలవు. అయితే, ఐజ్వాల్, భువనేశ్వర్, గ్యాంగ్టక్, కొచ్చి, తిరువనంతపురంలలో బ్యాంకులు బుధవారం తెరిచే ఉంటాయి.