FIH World Cup | వరుసగా నాలుగో ప్రపంచకప్ గెలువాలన్న నెదర్లాండ్స్ ఆశలపై నీళ్లు.. టైటిల్ నెగ్గిన అర్జెంటీనా
FIH World Cup | మహిళల హాకీ ప్రపంచకప్ (Women Hockey World Cup) ను అర్జెంటీనా (Argentina) కైవసం చేసుకుంది. నిన్న ఆమ్స్టెల్వీన్ (Amstelveen) లో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో అర్జెంటీనాను విజయం వరించింది. షూటౌట్లో 3-1 తేడాతో ఆతిథ్య నెదర్లాండ్స్ (Nedarlands) ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది.
FIH World Cup : మహిళల హాకీ ప్రపంచకప్ (Women Hockey World Cup) ను అర్జెంటీనా (Argentina) కైవసం చేసుకుంది. నిన్న ఆమ్స్టెల్వీన్ (Amstelveen) లో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో అర్జెంటీనాను విజయం వరించింది. షూటౌట్లో 3-1 తేడాతో ఆతిథ్య నెదర్లాండ్స్ (Nedarlands) ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది. వరుసగా నాలుగో మహిళా ప్రపంచకప్ గెలువాలన్న నెదర్లాండ్స్ ఆశలపై నీళ్లు చల్లింది.
ఆట నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరుజట్లు 1-1తో సమంగా నిలువడంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్ నిర్వహించాల్సి వచ్చింది. ఆట 30వ నిమిషంలో యిబీ జాన్సన్ గోల్ చేయడంతో నెదర్లాండ్స్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ద్వితీయార్థంలో పుంజుకున్న అర్జెంటీనా 54 వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుంది. మారియో గ్రానాటో అద్భుతమైన గోల్‌తో స్కోరును సమం చేయడంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది.
షూటౌట్లో అర్జెంటీనా క్రీడాకారిణులు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఆ జట్టు తరఫున విక్టోరియా గ్రానాటో, బ్రిసా, సోఫియా కైరో గోల్స్ సాధించగా.. నెదర్లాండ్స్ జట్టులో మారీన్ మాత్రమే లక్ష్యాన్ని చేర గలిగింది. దాంతో అర్జెంటీనా విజయం ఖాయమైంది. అర్జెంటీనాకు ఇది మూడో ప్రపంచకప్ టైటిల్ కావడం విశేషం. గతంలో 2002, 2010 లోనూ ఫైనల్స్‌లో నెదర్లాండ్స్‌పైనే గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇదే టోర్నీలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో బెల్జియం 1-0 తో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

