ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే పన్నులు పడతాయా.. వడ్డీ చెల్లింపులు ఎలా ఉంటాయి?
రెండేండ్లపాటు అధికరాబడుల్ని ఇచ్చిన స్టాక్ మార్కెట్లు ఇప్పుడు కుదేలయ్యాయి. మరోవైపు కనిష్ఠ వడ్డీతో సరిపెట్టేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) ప్రస్తుతం ఎక్కువరాబడిని ఆఫర్ చేస్తున్నాయి. అనిశ్చిత మార్కెట్ వాతావరణంలో పెట్టుబడి సురక్షితంగా ఉంచుతూ క్రమ రాబడినిచ్చేవి ఫిక్స్డ్ డిపాజిట్లే. మదుపుదారులు వారి పొదుపును ఫిక్స్డ్ చేయడమే ప్రస్తుత వాతావరణంలో శ్రేయస్కరమని ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్లు సూచిస్తున్నారు. ఇదే సమయంలో రిజర్వ్‌బ్యాంక్ రెపో రేటు వరుసగా పెంచుతుండటంతో బ్యాంక్‌లు సైతం ఎఫ్డీలపై అధిక వడ్డీని ప్రకటిస్తున్నాయి. ఎఫ్డీ ఖాతాల్ని ఎలా ప్రారంభించాలి? వడ్డీ చెల్లింపులు ఎలా ఉంటాయి? పన్నులు పడతాయా? ఇటువంటి అంశాలన్నింటినీ తెలుసుకొని ఫిక్స్డ్ డిపాజిట్‌కు శ్రీకారం చుట్టండి.
ఎఫ్డీ ఖాతా తెరవడం
మీకు పొదుపు ఖాతా ఉన్న బ్యాంక్‌లో టర్మ్ డిపాజిట్ ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు. లేదా ఎఫ్డీ చేయాలనుకున్న బ్యాంక్‌లో తొలుత సేవింగ్స్ ఖాతాను తొలుత తెరిచి, అటుతర్వాత ఎఫ్డీ ఖాతాను ప్రారంభించవచ్చు. సేవింగ్స్ ఖాతా లేకుండానే ఎఫ్డీ చేయడానికి బ్యాంక్ అనుమతిస్తే మీ కేవైసీని పూర్తి చేయాలి.
వడ్డీ చెల్లింపు
ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్‌లు చెల్లించే వడ్డీ మీరు ఎంతకాలానికి డిపాజిట్ చేస్తారన్న పరిమితిపై ఆధారపడి ఉంటుంది. నిర్దిష్ట కాలపరిమితిలో వచ్చే వడ్డీనంతటినీ టర్మ్ ముగిసిన తర్వాత అసలుతో కలిపి చెల్లించే సదుపాయం (క్యుములేటివ్), నెలవారీ, 3 నెలలు, 6 నెలలు, ఏడాది చొప్పున వడ్డీని చెల్లించే సౌలభ్యం (నాన్-క్యుములేటివ్) ఎఫ్‌డీల్లో ఉంది. ఎఫ్డీ ఖాతాను ప్రారంభించేటపుడే మీరు ఇందులో ఒక ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. నాన్-క్యుములేటివ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే వడ్డీ చెల్లించాల్సిన తేదీనాటికి వడ్డీని మీ పొదుపు ఖాతాలో బ్యాంక్ జమచేస్తుంది.
ఎఫ్డీపై ట్యాక్స్
ఎఫ్డీపై వచ్చే వడ్డీపై ఆదాయపు పన్ను విధిస్తారు. డిపాజిట్దారుకే ఈ భారం పడుతుంది. అయితే ఆ పన్నురేటు మీకు వర్తించే ట్యాక్స్ బ్రాకెట్ ప్రకారం ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో మీకు బ్యాంక్‌ల్లో ఉన్న అన్ని ఫిక్స్డ్ డిపాజిట్లపై కలిపి రూ. 40,000కు మించి వడ్డీ చెల్లింపు ఉంటే బ్యాంక్‌లే టీడీఎస్ ద్వారా పన్నును మినహాయించి, మిగిలిన డబ్బును ఖాతాలో జమచేస్తాయి. మీరు ట్యాక్స్ బ్రాకెట్లో లేకున్నా, టీడీఎస్ వద్దనుకున్నా ఫారం 15జీ లేదా ఫారం 15 హెచ్ నింపి, బ్యాంక్‌కు పంపించాలి.
ముందస్తు ఉపసంహరణ
డబ్బు అత్యవసరమైతే నిర్ణీత కాలపరిమితికి చేసిన ఎఫ్డీని ముందస్తుగా కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇలా ముందుగానే తీసుకుంటే బ్యాంక్ పెనాల్టీ వేస్తుంది. ఒక్కో బ్యాంక్‌కు ఒక్కో తీరులో ఈ పెనాల్టీ ఉంటుంది. అందుచేత మీరు ఎఫ్డీ చేసేటపుడే ముందస్తు విత్‌డ్రాయిల్‌కు సంబంధించిన నిబంధనలు చదవండి.
ఆటో రెన్యువల్
మీరు ముందుగా తెలియపర్చకపోతే..ఎఫ్డీ కాలపరిమితి ముగియగానే చాలావరకూ బ్యాంక్‌లు డిపాజిట్‌ను ఆటోమేటిక్‌గా రెన్యువల్ చేస్తాయి. మీరు ఎంతకాలానికి తొలుత డిపాజిట్ చేసారో తిరిగి అంతేకాలానికి ఈ ఆటోరెన్యువల్ ఉంటుంది. ఎఫ్డీ మెచ్యూర్ అయిన సమయంలో బ్యాంక్ ఆఫర్ చేసే వడ్డీ రేటు ఈ రెన్యువల్‌పై వర్తిస్తుంది. ఎఫ్డీ ఆటో రెన్యువల్‌ను మీరు వద్దనుకుంటే తొలుత అకౌంట్ ఓపెనింగ్ ఫారంలో మీరు దానికి సంబంధించిన ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
రుణ సదుపాయం
మీరు బ్యాంక్‌లో చేసిన ఎఫ్డీపై రుణం పొందే సౌలభ్యం కూడా ఉంటుంది. మీ ఎఫ్‌డీనే సెక్యూరిటీగా పెట్టుకుని బ్యాంక్ రుణం ఇస్తుంది. మీరు చేసిన డిపాజిట్ మొత్తంలో నిర్దేశిత శాతం గరిష్ఠరుణంగా బ్యాంక్ మంజూచేస్తుంది. ఈ శాతం వివిధ బ్యాంక్‌ల్లో ఒక్కోలా ఉంటుంది.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

