Bank Holidays in May | మీరు బ్యాంకుకు వెళుతున్నారా.. అయితే, మీ బ్యాంకు శాఖ తెరిచి ఉందా.. లేదా.. ఒకసారి చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మే నెలలో బ్యాంకులు 11 రోజులు పని చేయవు. అసలు మే నెల సెలవుతోనే మొదలవుతున్నది. దేశవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వివిధ కారణాల వల్ల బ్యాంకులకు సెలవులు వచ్చాయి. మే నెలలో ఐదు ఆదివారాలు, రెండు శనివారాలు బ్యాంకులు పని చేయవు. మొత్తంగా 11 రోజుల పాటు మే నెలలో బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. మే ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు పశ్చిమబెంగాల్లో బ్యాంకులు పని చేయవు. 7న రెండో శనివారం, 8న ఆదివారం, తొమ్మిదో తేదీన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు. వచ్చే నెలలో సెలవుల వివరాలు ఓ లుక్కేద్దాం..
తేదీ ———- సెలవు కారణం —————————- ఏయే ప్రాంతాల్లో సెలవు
మే 1 ———- ఆదివారం ————————– ——- దేశమంతటా సెలవు
మే 2 ——— రంజాన్/ ఇదుల్ ఫితర్ ——————– కేరళ
మే 3 — పరుశురాం జయంతి/రంజాన్/ఇదుల్ ఫితర్ —కేరళ మినహా దేశమంతా
బసవ జయంతి / అక్షయ తృతీయ
మే 7 ——– రెండో శనివారం —————————– దేశమంతటా సెలవు
మే 8 ——– ఆదివారం ———————————– దేశమంతటా సెలవు
మే 9 ——– రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ———– పశ్చిమబెంగాల్
మే 15 ——- ఆదివారం ———————————- దేశమంతటా సెలవు
మే 16 —— బుద్ధ పూర్ణిమ ——————————- త్రిపుర, బెలాపూర్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా,
ఉత్తరాఖండ్, జమ్ము, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ
మే 22 ——- ఆదివారం ——————————— దేశమంతటా సెలవు
మే 28 ——- నాలుగో శనివారం ———————— దేశమంతటా సెలవు
మే 29 ——- ఆదివారం ——————————– దేశమంతటా సెలవు