తక్కువ రిస్క్‌తో, ఎక్కువ భద్రతతో, ఆకర్షణీయ ప్రయోజనాలతో పిల్లలకు ఇండియా పోస్ట్ (భారతీయ తపాలా శాఖ) ఓ బీమా సౌకర్యాన్ని అందిస్తున్నది. పిల్లల విద్య, వివాహాది ఖర్చులకు తల్లిదండ్రులకు బాల జీవన్ బీమా పథకం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. ఆన్లైన్, ఆఫ్లైన్లలో ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. అధికారిక ఇండియా పోస్ట్ పోర్టల్ ద్వారా లేదా సమీపంలోని పోస్టాఫీస్ కార్యాలయానికి వెళ్లి బీమాను పొందవచ్చు.